రాధికా నిర్మాణంలో చిరు సినిమా

సీనియర్‌ నటి రాధికా శరత్‌ కుమార్‌ నిర్మాణంలో ఓ కొత్త సినిమాకు చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్  ఇచ్చినట్లు రాధిక సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ‘భవిష్యత్తులో మా రాడాన్‌ బ్యానర్‌లో ప్రాజెక్ట్‌ చేసేందుకు మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. కింగ్‌ ఆఫ్‌ మాస్‌ అయిన మీతో బ్లాక్‌ బస్టర్‌ తీసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని రాధిక ట్వీట్‌ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.