‘రానా నాయుడు’ షూటింగ్‌ పూర్తి

అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘రే డోనోవన్‌’ ఆధారంగా ‘రానా నాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌ రూపుదిద్దుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌ కోసం నిర్మితమౌతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో మొదటిసారి వెంకటేష్‌ నటిస్తున్నారు. ఇందులో ఆయన అన్న కొడుకు, హీరో దగ్గుబాటి రానా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇల్లీగల్‌ వ్యవహారాలు చేసే వ్యక్తిగా రానా, అతని తండ్రిగా, జైలునుండే అన్ని కార్యక్రమాలను సెట్‌చేసే గ్యాంగ్‌స్టర్‌గా వెంకటేశ్‌ నటిస్తున్నారు. అభిషేక్‌ బెనర్జీ, జాను టిబ్రేవాల్‌, సౌరవ్‌ ఖురానా, అభిషేక్‌ భలేరావ్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘రానా నాయుడు’ షూటింగ్‌ పూర్తయినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా ప్రకటించింది.