రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల రాగల 24 గంటల్లో భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.