రామ్‌చరణ్‌ స్థానంలో మరో హీరో, చిరంజీవి సలహా

చిరంజీవీ, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆచార్య. నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఈ చిత్రంలో మరో యువ హీరో పాత్రకు కూడా అవకాశముంది. ఈ పాత్రకు ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఎవ్వరి పేరూ ఖరారు కాలేదు. మొదట రామ్‌చరణ్‌తో ఈ పాత్ర చేయించాలని కొరటాల శివ అనుకున్నారు. కానీ రామ్‌చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చిత్ర నిర్మాణంలో లాక్‌ అయి పోయారు. ఇక రామ్‌చరణ్‌ నటించే అవకాశం లేదని తెలియడంతో మహేష్‌ బాబు ఈ చిత్రంలో చేయనున్నారని, పారితోషకం కూడా భారీగా 30 కోట్ల వరకు ఇస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే మహేష్‌కు తాము అసలు కాంటాక్ట్‌ చేయలేదని, ఆ ప్రస్తావనే రాలేదని చిరంజీవి ప్రకటించారు. యువహీరో పాత్రపై తాను టెన్షన్‌ పడుతుంటే నేనున్నానుగా టెన్షన్‌ ఎందుకని, మహేష్‌ మద్దతుగా నిలిచారే తప్ప ఆయన ఈ చిత్రంలో నటిస్తారనే చర్చ జరగలేదని కొరటాల శివ చెప్పారు. మధ్యలో అల్లు అర్జున్‌ ఈ పాత్ర చేస్తాడని ప్రచారం జరిగినప్పటకీ తిరిగి రామ్‌చరణ్‌ పేరు వార్తల్లోకి వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ కొంత బ్రేక్‌ తీసుకుని రామ్‌చరణ్‌ ఆచార్య సినిమా చేస్తాడని అన్నారు. కానీ కరోనా కారణంగా లాక్‌డౌన్‌ రావడంతో మూడు నెలల సమయం వృధా అయ్యింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తి చేయ్యడం రామ్‌చరణ్‌కు ముఖ్యమైపోయింది. ఇక రామ్‌చరణ్‌ నటించే అవకాశాలు లేకపోవడంతో మరో హీరోను చూడమని చిరంజీవి కొరటాల శివకు సలహా ఇచ్చాడంట. అయితే యువ హీరోల్లో ఎవ్వరికి ఈ అవకాశం దక్కనుందో ఎదురుచూడాల్సి ఉంది.