రామ్ చరణ్ తో మహానటి ‘నాటు’ స్టెప్పులు

రామ్ చరణ్ తో ‘మహానటి’  ‘నాటు.. నాటు…’ అంటూ స్టెప్పులేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడీ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం హైదరాబాద్ లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న“గుడ్ లక్ సఖి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరిద్దరూ స్టెప్పులేసారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిన అనారోగ్యం కారణంగా చిరంజీవి రాలేకపోయారు. ఆయన స్థానంలో రామ్ చరణ్ ఈ వేదికకు విచ్చేసారు. రామ్ చరణ్ ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకనిర్మాతలను అభినందించారు. ఇక ఈ సినిమాకు చాలా మంది జాతీయ అవార్డు గ్రహీతలు పని చేసిన ఈ సినిమాను చిన్న సినిమా అని పిలవద్దని అన్నారు.