రాష్ట్రంలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..

రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్ర అధికారిణి డైరెక్టర్‌ స్టెల్లా మాట్లాడుతూ.. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్టెల్లా పేర్కొన్నారు.