రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మెంటాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వరి, మొక్కజన్న రైతులకు అపారమైన నష్టం వాటిల్లింది. పంట చేతికందే సమయంలో అకాల వర్షం కారణంగా వరి మొక్కజన్న రైతుల పంటలు పొలాల్లోనే తడిసిమద్దయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శృంగవరపు కోటలో భారీ వర్షం కురిసింది. కాలువలు, గెడ్డలు పొంగాయి. ఈరోజు ఉదయం నుండి కాసిన విపరీతమైన ఎండకు ఒక్కసారిగా వర్షం కురవటంతో వాతావరణం చల్లబడింది. దత్తిరాజేరులో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు తిరుపతి రేణిగుంటలోనూ భారీ వర్షం కురుస్తోంది.
