రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎం జగన్‌
రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎం జగన్‌

రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మీడియా ముందుకు రానున్నారు. కాగా కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ బుధవారం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు