రియా అరెస్టులో రాజకీయ కుట్ర?

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య అనేక మలుపులు తిరుగుతూ ఆయన ప్రేయసి రియా చక్రవర్తి అరెస్టుకు దారి తీసింది. సుశాంత్‌ ఆత్మహత్యను ముంబయి ప్రభుత్వం పట్టించుకోలేదని బీహార్‌ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో ఆ కేసును సిబిఐకి అప్పగించాలని కోరింది. ఓట్ల కోసం బిజెపి పన్నిన ఎత్తుగడే ఇదని విమర్శలు ఉన్నాయి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ డ్రగ్స్‌ కేసులో దోషిగా తేలుస్తూ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) మంగళవారం రియాను అరెస్టు చేసింది. దీని వెనుక రాజకీయ కుయుక్తులు ఉన్నాయనే ప్రచారం బాలీవుడ్‌లో సాగుతోంది. ఈ అరెస్టును పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఖండించారు. రియాకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ‘మంత్రగత్తె వేట’, ‘మీడియా విచారణ’ అంటూ కొంతమంది ట్వీట్లు చేస్తే ‘కర్మ’, తప్పు చేసినందుకు పరిణామాలు’ అంటూ మరికొంతమంది ట్వీట్లు చేశారు.