రియా చక్రవర్తి బెయిల్‌ తిరస్కరణ

డ్రగ్స్‌ కేసులో గత వారం అరెస్ట్‌ అయిన నటి రియాచక్రవర్తికి ముంబయి కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. కేసు ప్రాథమిక దశలో ఉందని, ఈ సమయంలో రియాను బెయిల్‌పై విడుదల చేస్తే.. ఈ కేసులో ఇతర నిందితులను ప్రభావితం చేయవచ్చని కోర్టు పేర్కొంది. అలాగే సాక్ష్యాధారాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నిందితురాలికి  బెయిల్‌ పొందే అర్హతలేదని  సెషన్స్‌ కోర్టు జడ్జి తెలిపారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కోసం డ్రగ్స్‌ను సేకరించడాన్ని నాన్‌ బెయిలబుల్‌ కేసుగా  పేర్కొ‌న్నా‌రు.  ఈ కేసులో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ కేవలం 59 గ్రాములేనన్న ఆమె వాదనను కోర్టు తోసిపుచ్చింది. కాగా, ఆమె బెయిల్‌ కోసం ముంబయి హైకోర్టు‌ను  ఆశ్రయించనున్నట్లు రియా తరపు న్యాయవాది పేర్కొన్నారు.