రియా సోదరుడు, సుశాంత్‌ మేనేజర్‌ అరెస్ట్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరండాలను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఇద్దరినీ దాదాపు 10 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్‌ చేసినట్టు ఎన్‌సిబి అధికారులు తెలిపారు. అంతకుముందు ఉదయం షోవిక్‌, మిరండా నివాసాల్లో ఎన్‌సిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోవిక్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. షోవిక్‌ చక్రవర్తి గంజాయి, మరిజువానాలను ఆర్డర్‌ చేసి డ్రగ్‌ సరఫరాదారు అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌కు గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు జరిపేవాడని ఎన్‌సిబి కోర్టుకు తెలియజేసింది. షోవిక్‌, శామ్యూల్‌ల అరెస్టుపై సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్‌ స్పందించింది. ”భగవంతుడికి కతజ్ఞతలు. మమ్మల్ని అందరినీ వాస్తవం వైపు నడిపించు” అని ట్వీట్‌ చేసింది.