రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న మోడీ క్యాబినెట్
రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న మోడీ క్యాబినెట్

రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న మోడీ క్యాబినెట్

మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో ఈ కోత ఉంటుందంటూ ఒక ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఈ మేరకు 1954 చట్టాన్ని సవరించింది. అదే విధంగా, ఎంపీలకు ఇచ్చే లాడ్స్ (ఎంపీ లాడ్స్)ను (2020-21 , 2021-22) రద్దు చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ సోమవారంనాడు మీడియాకు వెల్లడించారు. రెండేళ్ల ఎంపీ లాడ్స్ మొత్తంగా వచ్చే రూ.7,900 కోట్లతో ఒక నిధిని (కన్సాలిడేటెడ్ ఫండ్) ఏర్పాటు చేస్తామని జవదేకర్ తెలిపారు.