గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. భారత్‌లో మరో రికార్డును సృష్టించింది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని.. భారత్‌లో ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగానే.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలో (3.24 కోట్లు) కేసులు నమోదవ్వగా.. రెండు కోట్ల మార్క్‌ను దాటిన దేశం భారత్ కావడం గమనార్హం. కాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా.. 3,57,229 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఇక సోమవారం ఒక్కరోజే.. 3,449 మంది మరణించారు. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 34 లక్షలకు చేరింది.
