రెండు లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా మారింది. రోజుకు వేలాది మందిని పొట్టనబెట్టుకుంటూ బెంబేలెత్తిస్తున్నది. గడచిన 24 గంటల్లో 3,293 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. దీంతో వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య రెండు లక్షలను దాటింది. తాజా మరణాలతో కరోనా మరణాల స్యం 2,01,187కు చేరింది. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 3,60,960 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267కు చేరాయి. బుధవారం ఉదయం నాటికి 29,78,709 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కేసులు 3.60 లక్షలు కాగా.. కరోనా నుంచి 2.61 లక్షల మంది కోలుకున్నారు.