రెహమాన్‌ కొత్త చిత్రం

ఎ.ఆర్‌. రెహమాన్‌ ఇటీవల ’99 సాంగ్స్‌ అనే పాన్‌ ఇండియా మూవీని నిర్మించి, విడుదల చేశారు. తాజాగా వర్చువల్‌ రియాలిటీ మూవీ అయిన ‘లే మాస్క్‌’ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం జరుగుతున్న కాన్స్‌ ఇంటర్నేషన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 75 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని అక్కడి వ్యూవర్స్‌ కోసం 36 నిమిషాలకు కుదించారు. రెహమాన్‌ భార్య సైరా ఇచ్చిన ఐడియాలో ఈ చిత్రం రూపుద్దికుంది. అంతర్జాతీయ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ, అత్యుత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కించారు.