రేపు ఉదయం 10 గంటలకు మోదీ ప్రసంగం
రేపు ఉదయం 10 గంటలకు మోదీ ప్రసంగం

రేపు ఉదయం 10 గంటలకు మోదీ ప్రసంగం

దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు లాక్‌డౌన్‌పై ఆయన కీలక నిర్ణయం ప్రకటించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది. కాగా, శనివారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెజారిటీ రాష్ట్రాలు ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒడిషా, పంజాబ్‌, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు