రేపు ఎన్‌సిబి ముందు హాజరౌతున్న రకుల్‌

డ్రగ్స్‌ కేసులో కలకలం రేపిన వారి పేర్లలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరుంది. డ్రగ్స్‌ కేసు విచారణకు మూడు రోజుల్లో హాజరు కావాలని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) నోటీసులు జారీ చేసింది. అయితే నాకెలాంటి నోటీసులు అందలేదని రకుల్‌ ప్రీతిసింగ్‌ మాటమార్చడం గమనార్హం. రకుల్‌ వ్యాఖ్యలను ఎన్‌సిబి ఖండిస్తోంది. మేము వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించాం. చివరకు వాట్సాప్‌లో కూడా సమన్లు పంపాము. కానీ ఆమె స్పందించలేదు. రేపు కూడా ఆమె విచారణకు హాజరు కాకపోయినా.. ఏవైనా సాకులు చెప్పినా రకుల్‌కి నాన్‌బెయిలబుల్‌ సమన్లు జారీ చేస్తామని పేర్కొంది. దీంతో రకుల్‌ రేపు విచారణకు హాజరవుతానని చెప్పారు.