రేపు ఢిల్లీకి సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.