రేపు మరోసారి ఢిల్లీ కి సీఎం జగన్
రేపు మరోసారి ఢిల్లీ కి సీఎం జగన్

రేపు మరోసారి ఢిల్లీ కి సీఎం జగన్

రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్‌. రేపు సాయంత్రం అమిత్‌షాతో జగన్‌ భేటీకానున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్‌ ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు. ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం ఈ భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.