టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువుకు చెందిన ఫామ్ హౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి ఉపశమనం లభించింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఈ రోజు విడుదల కానున్నారు

రేవంత్ రెడ్డి కి బెయిల్ మంజూరు