అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాలోని జిల్లాలోని నాంపల్లి మండలంలో వడగండ్ల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.

రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి