కరోనానివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రైతు బజార్లతోపాటు స్థానిక మార్కెట్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. వనస్థలిపురంలోని రైతు బజార్‌ను రెండు భాగాలుగా చేసి ఒకటి పక్కనే ఉన్న భవనంలోకి, మరొకటి పార్క్‌లోకి మార్చారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు, వినియోగదారులకు సుధీర్ రెడ్డి వివరించారు. ఎన్టీఆర్ నగర్ మార్కెట్‌ను సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియానికి తరలించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.

రైతు బజార్లను పరిశీలించిన టీఆరఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి