రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏకకాలంలో 10,641 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఆన్‌లైన్‌ వీడియో ద్వారా వీక్షిస్తూ ఆరంభించారు. అంతకు ముందు సీఎం జగన్‌ను వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి కండువా కప్పి అభినందనలు తెలిపారు. మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్‌బీకేలో లభించే సేవలను పరిశీలించారు