రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన జగన్‌
రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన జగన్‌

రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన జగన్‌

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల కొనుగోలు బుకింగ్‌ చేసుకునే వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గురువారం అమరావతిలో అగ్రి మిషన్‌, కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. సమావేశంలో కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవటానికి సీఎం జగన్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు