రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : మంత్రి ఆళ్ల నాని

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)పేర్కొన్నారు. స్థానిక సాలిపేట సాయి సుధ హాస్పిటల్ ప్రక్కన డా.వాడ్రేవు రవి ఏర్పాటు చేసిన అధునాతన ఎ వాన్ రోగనిర్ధారణ కేంద్రం నూతన భవనంను మంత్రులు ఆళ్ల నాని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం ప్రారంభించారు. మూడు అంతస్తుల భవనంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన ఎమ్మార్ఐ, సిటీ స్కాన్ రెవల్యూషన్ ఏసీటీ, అల్ట్రా సౌండ్, కలర్ డాప్లర్, 2డి ఎకో, మామ్మో గ్రఫీ, డెక్స స్కాన్, వంటి అధునాతన వైద్య యంత్ర పరికరాలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయని వాటిని వైద్య నిపుణులు అందిపుచ్చుకుని సామాన్యులకు సైతం వాటి ఫలితాలు అందే విధంగా వైద్య సేవలు అందించాలని సూచించారు.