రోడ్ల నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష
రోడ్ల నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

రోడ్ల నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

నగరంలో రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆయన శనివారం బుద్ధభవన్‌ లో హైదరాబాద్ రోడ్డు డవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కింద చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇది వర్కింగ్ సీజన్ అని.. ఒక నెల పాటు పనులు చేయవచ్చన్నారు. జూన్ నుండి వర్షాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.