లక్షణాలు లేకుంటే రావొద్దు: మంత్రి ఈటల
లక్షణాలు లేకుంటే రావొద్దు: మంత్రి ఈటల

లక్షణాలు లేకుంటే రావొద్దు: మంత్రి ఈటల

కరోనా విషయంలో కొందరు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వైద్యుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షణాలు లేనివారు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు రావొద్దని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దీనివల్ల కరోనా పేషంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. లక్షణాలు ఉంటే ఎంతమందికైనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు