లాక్డౌన్ నాలుగో దశ కూడా కొనసాగుతుందని, అయితే సరికొత్త నిబంధనలతో ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. కరోనాపై పోరాటం కొనసాగుతూనే ఆర్ధిక కార్యకలాపాలను కూడా విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందులో భాగంగా నాలుగోదశ లాక్డౌన్లో ప్రజారవాణాకు గ్రీన్ సిగల్ ఇచ్చే అవకాశముంది. బౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లను వాడుతూ పరిమిత సంఖ్యలో ప్రజా రవాణాకు అనుమతినివ్వనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్ల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను విభజించారు. లాక్డౌన్ రెండు, మూడు దశల్లో కొంత మేరకు ఆంక్షలను సడలించారు. ఇప్పుడు నాలుగో దశలో మరిన్ని ఆంక్షలను సడలించనున్నారు. గ్రీన్ జోన్లలో ప్రజారవాణాకు పూర్తి అవకాశం ఇవ్వడంతోపాటు మరిన్ని షాపులు, దుకాణాలు తెరచుకోనున్నాయి. రెడ్జోన్లో ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి కోసం రెండ్జోన్లలో సైతం పరిమితంగా ప్రజా రవాణాను అనుమతించే అవకాశముంది. ఇప్పటికే 30 రూట్లలో 15 రైళ్లను నడుపుతున్నారు. వీటిని మరింత పెంచే అవకాశముంది. 18వ తేదీ నుండి దేశీయ విమనాలు కూడా ఎంపిక చేసిన నగరాల నుంగా గాల్లోకి ఎగరనున్నాయి.
