లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి
లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ”అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా.. ‘ అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. ‘ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు’ అని గర్విస్తాడా, లేక…’ అంటూ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ‘లోకేష్…! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా…! తీసుకుంటున్నావా…? ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?!’ అంటూ చురకలంటించారు.