వచ్చేనెల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ప్రారంభం

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తునన ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ముందు వచ్చేవారం టెస్ట్‌ షూట్‌ జరపనున్నారు. దీని ద్వారా పూర్తిస్థాయి షూటింగ్‌ చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించుకొని వచ్చే నెల్లో షూటింగ్‌ ప్రారంభిస్తారు. లాక్‌డౌన్‌ అనంతరం సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ చిత్రానికి షూటింగ్‌ ప్రారంభించాలని భావించారు. కానీ టెస్ట్‌ షూటే చేయలేకపోయారు. అయితే ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సిద్దమయ్యారు. ఇప్పటికే 80 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమాకు మిగిలిన షెడ్యూల్‌ను ఇప్పుడు కంప్లీట్‌ చేయనున్నాను. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీయార్‌, రామ్‌చరణ్‌తోపాటు బాలీవుడ్‌ తారలు అజరుదేవగన్‌, అలియా భట్‌, శ్రియ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు.