వలస కార్మికుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్
వలస కార్మికుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్

వలస కార్మికుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్

కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుని అల్లాడుతున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ప్రయాణ ఖర్చులను ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కమిటీలే భరిస్తాయని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ప్రకటించారు. ‘‘వలస కూలీలు, కార్మికులందరి రైలు ప్రయాణానికి అవసరమయ్యే ఖర్చులను స్థానిక కాంగ్రెస్ కమిటీలు భరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వారికి సాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది..’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.