లేడీ అమితాబ్, లేడీ సూపర్‌స్టార్‌గా హీరోయిన్స్‌కు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చిన నట విశ్వభారతి విజయశాంతి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తనదైన నటనతో గ్లామర్ సినిమాలే కాదు. మహిళా ప్రధాన చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. అప్పటి సీనియర్ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లోనూ, విప్లవాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి రీసెంట్‌గా మహేశ్ హీరో గా చేసిన‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషించిన భారతి పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. బుధవారం విజయశాంతి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలను అందజేస్తున్నారు. ‘విజయశాంతిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషం మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ సూపర్‌స్టార్ మహేశ్ ట్విట్టర్ ద్వారా విజయశాంతికి పుట్టినరోజు అభినందనలు తెలిపారు
