విద్యార్థులకు కేటీఆర్ సూచనలు
విద్యార్థులకు కేటీఆర్ సూచనలు

విద్యార్థులకు కేటీఆర్ సూచనలు

లాక్‌డౌన్ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి తల్లిదండ్రులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఒక సూచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేసే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ట్విట్టర్‌లో కోరారు. దీని ద్వారా ఇంటి దగ్గర నుంచే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో నేర్చుకోవచ్చున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చన్నారు. టి-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ప్రసారాలు కేబుల్ నెట్వర్క్ ద్వారా, వెబ్సైట్ http://tsat.tv, Youtube/tsatnetwork, T-SAT Mobile Appలలో అందుబాటులో ఉంటాయన్నారు.