విశాఖలో పొగమంచు.. పలు విమానాలు రద్దు

విశాఖను దట్టమైన పొగమంచు ఆవరించింది. పొగమంచులో ప్రయాణీకులు తీవ్ర అవస్థలుపడుతున్నారు. ఈ నేపథ్యంలో… పలు విమానాలను దారి మళ్లించినట్లు, మరికొన్ని విమానాలను అధికారులు రద్దు చేసినట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఉదయం 9 గంటల తర్వాత విమాన రాకపోకలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.