విశాఖ గ్యాస్ లీక్‌‌ బాధితులకు చెక్కుల పంపిణీ
విశాఖ గ్యాస్ లీక్‌‌ బాధితులకు చెక్కుల పంపిణీ

విశాఖ గ్యాస్ లీక్‌‌ బాధితులకు చెక్కుల పంపిణీ

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. సోమవారం మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కాగా, విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో 12మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి నష్ట పరిహారంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన జరిగిన మూడురోజుల వ్యవధిలోనే రూ. కోటి పరిహారం బాధితులకు పంపిణీ చేయటం జరిగింది.