వెయ్యి కోట్ల మైలు రాయిని దాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రాజమౌళి తాజాగా చెక్కిన చిత్ర శిల్పం ఆర్‌ఆర్‌ఆర్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా.. భారీ వసూళ్లతో దూసుకెళుతుంది. వెయ్యి కోట్ల వసూళ్ల రాబట్టుకొని మరో మైలు రాయికి చేరుకుంది. ఇటు మాలీవుడ్‌ నుండి అటు బాలీవుడ్‌ వరకు ప్రేక్షకులు కనక వర్షం కురిపిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల భారీ వ్యయం నాలుగేళ్లు కష్టించి తీర్చిదిద్దిన చిత్రానికి భారీ స్పందన రావడంతో రూ. 1000 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క బాలీవుడ్‌లోనే రూ. 200 కోట్లు కలెక్ట్‌ చేయగా.. నైజాంలోనూ రూ. 100 కోట్ల వసూళ్లను అందుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.