వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ను ప్రారంభించిన జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,92,674 మంది అక్కచెల్లెమ్మలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందుకు 589 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పథకం కోసం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..  దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యాక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. రాజ్యాంగ స్పూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.