‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ రెండో విడత ప్రారంభం

రెండో విడత వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆటో, ట్యాక్సీ ఉన్న 2,62,493 మంది లబ్దిదారులకు రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందనుంది. ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు.