‘వైఎస్సార్ యాప్’‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌
‘వైఎస్సార్ యాప్’‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

‘వైఎస్సార్ యాప్’‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్ర‌భుత్వం చ‌ర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవ‌సాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్ కార్య‌ల‌యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం తెలుసుకోవ‌చ్చు.