ఆంధ్రప్రదేశ్లో పొదుపు సంఘాల మహిళలకు వరుసగా రెండో ఏడాది కూడా ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ పథకాన్ని సిఎం జగన్ జమ చేశారు. శుక్రవారం ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో లబ్దిదారులకు డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… 1.02 కోట్ల మందికిపైగా పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా చెల్లించిందని చెప్పారు.
