వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం
వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం

వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం- డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్‌ సర్వీసులు తిరిగి రేపటి నుంచి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయానికి తెరతీస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో 108 వాహనాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి పేదల ప్రాణాలను హరించాయన్నారు.ఆళ్ల నాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 201 కోట్ల రూపాయలు నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 108, 104 వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ప్రారంభించనున్నారని తెలిపారు. దీంతో 676 మండలాల్లో నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అర్బన్ పరిధిలో 15 నిమిషాలు, రూరల్ పరిధిలో 20నిమిషాలు,ఏజెన్సీ పరిధిలో 25 నిమిషాల్లో 108 వాహనం చేరుకునేలా టైం మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మూడు రకాలైన 108 వాహనాలు అందుబాటులోకి తేవడంతో పాటు 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 26 నియోనాటల్ సపోర్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.