వైసిపిలో చేరనున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే రమేష్‌ బాబు

టిడిపి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు రేపు వైసిపిలో చేరనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన వైసిపి కండువా కప్పుకోనున్నారు. విశాఖకు రాజధానిగా టిడిపి వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల కిందటే ఆయన టిడిపికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు.