వైసిపిలో చేరిన పంచకర్ల రమేష్‌బాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,  మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైసిపిలో చేరారు.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమక్షంలో శుక్రవారం ఆయన వైసిపిలో చేరారు. సిఎం జగన్‌ వైసిపి కండువా కప్పి రమేష్ బాబును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపి విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.