వైసీపీలో చేరనున్న టీడీపీ కీలకనేత
వైసీపీలో చేరనున్న టీడీపీ కీలకనేత

వైసీపీలో చేరనున్న టీడీపీ కీలకనేత

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున కీలకనేతలు, మాజీలు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. తాజాగా టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో గాదె వెంకట్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. గాదెతో పాటు ఆయన కుమారుడు మధుసూధన్ రెడ్డి కూడా వైసీపీలో చేరబోతున్నారు