వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే..

రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ ఖరారు చేసింది. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు పారిశ్రామికవేత్త, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఇక నాలుగో సీటును మరో పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానికి కేటాయించారు. మోపిదేవి, పిల్లి.. ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్నారు. మండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో వీరిద్దరికీ రాజ్యసభ అవకాశం దక్కింది. ఇక అయోధ్య రామిరెడ్డికి గతంలోనే జగన్ మాట ఇచ్చారు. దీంతో ఆ హామీని నెరవేర్చారు.