వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

పలు పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ నార్త్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు.టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ పిఎల్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌, టీఎస్‌ఎన్‌ మూర్తి, రజక సంఘం నార్త్‌ అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీలోకి చేరారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.