వైసీపీ లో చేరిన డొక్కా మాణిక్య వర ప్రసాద్

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్యా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికకు తాడేపల్లిలోని జగన్ నివాసం వేదికైంది. ఈ సందర్భంగా డొక్కాకు వైసీపీ కండువా కప్పిన జగన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.