శోభన్‌బాబు బయోపిక్‌ .. హీరో ఎవరంటే..

ఇప్పటికే టాలీవుడ్‌లో జీవిత కథల ఆధారంగా పలు బయోపిక్‌లు తెరకెక్కాయి. ఈ బాటలోనే టాలీవుడ్‌ హీరో శోభన్‌బాబు జీవిత కథ ఆధారంగా మరో బయోపిక్‌ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. కాగా, శోభన్‌బాబు పాత్రలో దగ్గుపాటి రాణా నటించబోనున్నట్లు సమాచారం. రాణా ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న హిరణ్యకశ్యప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. మరి ఈ సమయంలో రాణా శోభన్‌బాబు బయోపిక్‌లో నటిస్తారా? లేదా అనేదానిపై స్పష్టతనివ్వాల్సి వుంది.