‘శ్యామ్‌ సింగ రాయ్’లో నానివి రెండు పాత్రలే

నాని ‘శ్యామ్‌ సింగ రాయ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడిగా రాహుల్‌ సాంకృత్యాన్‌ కి ఇది రెండవ సినిమా. ఈ సినిమాతోనే వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో నాని మూడు పాత్రలు చేస్తున్నట్లుగా మొదట ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాలో నాని రెండు పాత్రలు మాత్రమే చేస్తున్నట్టుగా మేకర్స్‌ చెప్పారు. ఈ పాత్ర 70వ దశకంలో కథ జరుగుతున్నప్పుడు కనిపిస్తుంది. ఈ పాత్రలోనే నాని డిఫరెంట్‌ లుక్‌ తో కనిపించనున్నారు. ఈ పాత్ర సరసన హీరోయిన్‌ గా సాయిపల్లవి కనిపించనుంది.

ఇక వాసు అనే పాత్ర ప్రస్తుతం జరిగే కథలో కనిపిస్తుంది. ఈ పాత్ర జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఈ ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ ను ఒక రేంజ్‌ లో నడిపించినట్టు అప్‌ డేట్స్‌ ను బట్టి అర్థమవుతోంది. వాసు పాత్రలో నాని చాలా స్లిమ్‌ గా కనిపిస్తున్నాడనీ ‘శ్యామ్‌ సింగ రాయ్’ పాత్ర కోసం ఆయన బరువు పెరిగాడని చెప్పుకొచ్చారు.