శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,01,818 క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అవుట్‌ ఫ్లో 4,96,497గా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు.. ప్రస్తుతం నీటి నిల్వ 208.72 టీఎంసీ లుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. వర్షాలు ఇంకా కొనసాగితే మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.